ENGLISH

చిరుని సీఎమ్ చేద్దామ‌నుకున్నాడా?

20 October 2020-18:00 PM

చిరంజీవి - వి.వి.వినాయ‌క్‌ల‌ది అల్టిమేట్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఠాగూర్ సూప‌ర్ హిట్ట‌య్యింది. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150కీ ఆయ‌నే ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో చిరు అభిమానులు మెచ్చే విధంగా చిరుని చూపించి మెగా అభిమానుల ద‌గ్గ‌ర మార్కులు కొట్టేశాడు వినాయ‌క్‌. అయితే చిరు కోసం ఎప్పుడో ఓ క‌థ రాసుకున్నాడ‌ట వినాయ‌క్‌. అందులో చిరంజీవిని ముఖ్య‌మంత్రిగా చూపించాల‌నుకున్నాడ‌ట‌. కానీ ఆ క‌థ తెర‌కెక్కించ‌డం కుద‌ర్లేద‌ని చెప్పుకొచ్చాడు వినాయ‌క్. ``రాజా ర‌వీంద్ర‌తో ఓ రోజు చిరంజీవి క‌బురంపారు.

 

త‌మిళంలో `ర‌మ‌ణ‌` చూశావా? అన్నారు. చూశాన‌ని చెప్పాను. అది నాకు స‌రిపోతుందా? అని అడిగారు. `అదిరిపోతుంది` అన్నా. క్లైమాక్స్ మార్చాల‌ని సూచించి, కొన్ని మార్పులు చెప్పాను. అప్ప‌ట్లో చిరంజీవి గారి కోసం ఓ క‌థ రాశా. అందులో చిరంజీవిది ముఖ్య‌మంత్రి పాత్ర‌. అందుకోసం రాసుకున్న స‌న్నివేశాల్ని ఠాగూర్‌లో క‌లిపేశాం. అందుకే... ఆ క‌థ తీయ‌లేక‌పోయా`` అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు వినాయ‌క్‌. ఠాగూర్ రాక‌పోయి ఉంటే, చిరు సీఎమ్ సినిమా వ‌చ్చేసేదేమో..? చిరు సీఎమ్ గా క‌నిపిస్తే ఎలా ఉండేదో అప్ప‌ట్లో..?

ALSO READ: 'న‌ర్త‌న శాల‌' టికెట్ ఎంత‌?