ENGLISH

క‌ల్యాణ్ రామ్ కి ఐటెమ్ గాళ్ దొరికేసింది!

04 February 2021-14:00 PM

సినిమాలో హీరోయిన్ ఎలా ఉన్నా - ఐటెమ్ పాట ఉంటే మాత్రం - హీరోయిన్ రేంజ్ ఉన్న భామ‌ని దింపేయాల‌ని డిసైడ్ అయిపోతున్నారంతా. అందుకే ఎక్క‌డెక్క‌డి నుంచో వెదికి ప‌ట్టుకుని ఐటెమ్ భామ‌ల్ని దిగుమ‌తి చేసేస్తున్నారు. తాజాగా క‌ల్యాణ్ రామ్ సినిమాకు ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి... ఐటెమ్ గాళ్ ని ప‌ట్టుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార్ట‌. కొత్త ద‌ర్శ‌కుడు వేణు మ‌ల్లిడితో క‌ల్యాణ్‌రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి `రావ‌ణ‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో వుంది.

 

ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంద‌ట‌. అందుకోసం వారినా హుస్సేన్‌ని ఎంచుకున్నారు. త‌న‌ది ఆఫ్ఘ‌నిస్థాన్. అయితే ఐటెమ్ సాంగులు చేయ‌డం కొత్త కాదు. 'లవ్‌ యాత్రి', 'దబాంగ్‌ 3' సినిమాల్లో మాస్ పాట‌ల‌కు స్టెప్పులేసింది. అందుకే త‌న‌ని `రావ‌ణ‌` కోసం ఎంచుకున్నార్ట‌. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. పున‌ర్జన్మ‌ల పాయింటేదో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ గా ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.

ALSO READ: నాగ‌చైత‌న్య చేజారిపోతున్న సినిమా