ENGLISH

Boyapati Srinu: బోయపాటి సినిమాకి 'వారియర్' కష్టాలు

30 July 2022-11:33 AM

బాలకృష్ణ ‘అఖండ’తో థియేటర్లలో మాస్ హంగామా సృష్టించారు దర్శకుడు బోయపాటి. కరోనా తర్వాత ‘అఖండ’తో మళ్ళీ థియేటర్లు కళకలాడాయి. ఇదే జోష్ లో బోయపాటి కొత్త సినిమా కూడా ఖరారైపోయింది. రామ్ పోతినేని హీరోగా సినిమాకి కొబ్బరికాయ్ కూడా కొట్టేశారు. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఇప్పుడీ సినిమాకి ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికి కారణం.. రామ్ 'వారియర్'.

 

లింగుస్వామీ, రామ్ కాంబినేషన్ లో వచ్చిన వారియర్ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హిట్ కొట్టాడు రామ్. అదే ఊపులో మరో మాస్ సినిమాగా వారియర్ ని తీర్చిదిద్దారు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా రాజీపడకుండా వారియర్ ని నిర్మించారు. అయితే ఈ సినిమా దారుణంగా దెబ్బకొట్టేసింది. నిర్మాతలకు చాలా నష్టాలు మిగిల్చింది. ఇప్పుడా ఎఫెక్ట్ బోయపాటి సినిమాపై పడింది. బోయపాటి-రామ్ సినిమా ఆగస్ట్ నుండి మొదలుకావాలి.

 

ప్రస్తుతం ఫైనాన్షియర్ల కోసం వెతుకుతున్నారు నిర్మాత. మొత్తానికి వారియర్ కష్టాలు బోయపాటి సినిమాపై పడ్డాయి.

ALSO READ: ఆ ద‌ర్శ‌కుడు క‌నిపిస్తే కొడ‌తామంటున్నారు..