ENGLISH

Warrior: వారియ‌ర్‌... స‌గానికి స‌గం పోతుందా?

19 July 2022-14:06 PM

ఇస్మార్ట్ శంక‌ర్ తో దుమ్ముదులిపాడు రామ్‌. ఆ సినిమాతో త‌న రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే వారియ‌ర్ కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్ట‌గ‌లిగారు. త‌మిళంలో కూడా ఈ సినిమాని విడుద‌ల చేస్తుండ‌డంతో... అక్క‌డి మార్కెట్ వారియ‌ర్‌కి బాగా ప్ల‌స్ అవుతుంద‌ని భావించారు. కానీ.. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. త‌మిళంలో ఈ సినిమా బోల్తా ప‌డింది. ఓవ‌ర్సీస్‌లో ఈ మాస్ సినిమా ప‌ప్పులు ఉడ‌క‌లేదు. తెలుగునాట కూడా అంతే.

 

ఏపీ, తెలంగాణ క‌లిసి రూ.40 కోట్ల‌కు థియేట‌రిక‌ల్ రైట్స్ అమ్ముడ‌య్యాయి. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు రాష్ట్రాల్లోనూ రూ.18 కోట్లు మాత్ర‌మే వ‌సూల‌య్యాయి. మ‌హా అయితే.. మ‌రో 2 కోట్లు వ‌స్తాయి. అంటే... 20 కోట్లు మాత్ర‌మే.

 

పెట్టిన పెట్టుబ‌డి 40 కోట్ల‌యితే, 20 వ‌చ్చాయి. అంటే 20 కోట్లు న‌ష్ట‌మ‌న్న‌మాట‌. ఈ వారం థ్యాంక్యూ సినిమా వ‌స్తోంది. యూత్‌ని ఈ సినిమా థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంది. కాబ‌ట్టి... ఈ వీకెండ్ వారియ‌ర్ వ‌సూళ్లు మ‌రింత దారుణంగా ఉండే అవ‌కాశం ఉంది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌వాత వ‌చ్చిన `రెడ్‌` ఓకే అనిపించుకొంది. అది క‌మ‌ర్షియ‌ల్ హిట్టేం కాదు. కాక‌పోతే... నిర్మాత‌ల‌కు డబ్బులు పోలేదు. ఈసారి మాత్రం స‌గానికి స‌గం పోయాయి.

ALSO READ: DJ Tillu 2: 'డిజె టిల్లు’ 2 నుండి దర్శకుడు అవుట్