ప్రభాస్ నటించిన కల్కి సినిమా ట్రైలర్ జూన్ 10న రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ ట్రైలర్ ని వీక్షించారు. ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచేసారు కల్కి టీమ్. ఈ ట్రైలర్ ని చూసిన సినీప్రియులు నాగఅశ్విన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. హాలివుడ్ రేంజ్ లో ఉంది మూవీ, విజువల్ ట్రీట్ అదిరింది అని ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 'కల్కి' థియేటర్స్ లో సందడి చేస్తాడో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దశావతారాల్లో ఒకటైన 'కల్కి' అవతారం కలియుగాంతంలో ఉంటుందని, కలియుగం అంతం అవకుండా కల్కి వచ్చి కాపాడతాడని అదే ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు 'కల్కి' టైటిల్ రోల్ ప్రభాస్ అనే అంతా అనుకుంటున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ కల్కి కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో దీపికా పదుకోనే ప్రెగ్నెంట్. అశ్వత్థామ క్యారక్టర్ లో కనిపించిన అమితాబ్ నేను రక్షించాల్సింది ఒక్కడినే అని అంటాడు. దీపికాతో నువ్విప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మా, సృష్టిని, నేను కాపాడతాను అని చెప్తాడు. దీపికా , ప్రభాస్ లు ఇద్దరు కలిసి ఒకే ఒక్క షాట్ లో కనిపిస్తారు. ప్రభాస్, అమితాబ్ ల మధ్య జరిగిన యాక్షన్ సీన్స్ ద్వారా ప్రభాస్ కల్కి కాదని, దీపికాకు పుట్టబోయే బిడ్డ కల్కి అని ప్రచారం మొదలయ్యింది. మూవీ ఎండింగ్ లో దీపికా కల్కికి జన్మనివ్వడంతో మొదటి పార్ట్ పూర్తి అవుతుంది. పార్ట్ 2 కి ఆ పాత్ర ద్వారా లీడ్ ఇస్తారని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
కల్కి అనౌన్స్ మెంట్ నుంచి మొదలైన పుకార్లు ట్రైలర్ తరవాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నాగ అశ్విన్ కథ కంటే ఇంకో డజను కొత్త కథలు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లకి చెక్ పడాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. కల్కి టైటిల్ రోల్ లో ప్రభాస్ నటించకపోతే ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు? అసలు ప్రభాస్ పాత్ర ఏంటి అన్న సందేహాలకి జూన్ 27 న సమాధానాలు దొరకనున్నాయి. కల్కిలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు కల్కిలో . ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారో అన్న ఆసక్తి పెరిగింది.