ENGLISH

ఈవార‌మూ.. తుస్సుమ‌నిపించిందే

03 April 2021-12:00 PM

ప్ర‌తీవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త చిత్రాల జోరు క‌నిపిస్తోంది. ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. 2021 ప్రారంభం నుంచీ ఇదే ప‌రిస్థితి. ఈ వారం కూడా రెండు సినిమాలొచ్చాయి. `వైల్డ్ డాగ్‌`, `సుల్తాన్` త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి. ఈ రెండు సినిమాల టాక్ అంతంత మాత్ర‌మే. దానికి తోడు క‌ల‌క్ష‌న్లు కూడా ఘోరంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చాలా చోట్ల థియేట‌ర్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. తొలి రోజే ఇలా ఉంటే... రాబోయే రోజుల్లో వీటి ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవొచ్చు.

 

తెలుగు రాష్ట్రాల‌లో ఎండల జోరు ఎక్కువైంది. జ‌నాలు బ‌య‌ట‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. దానికి తోడు క‌రోనా భ‌యాలు ఉండ‌నే ఉన్నాయి. అందుకే వ‌సూళ్లు ప‌ల‌చ‌గా క‌నిపిస్తున్నాయి. పైగా ఇటీవ‌ల నాగార్జున‌కు వ‌రుస ఫ్లాపులొచ్చాయి. `వైల్డ్ డాగ్‌` అనే టైటిల్ కూడా థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించే విధంగా లేదు. అయితే కార్తి సినిమాల‌కు ఎప్పుడూ ఓపెనింగ్స్ బాగుంటాయి. అయితే ఈసారి `సుల్తాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎదురీదుతోంది. ర‌ష్మిక సైతం.. జ‌నాల్ని థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించ‌డంలో విఫ‌లమైంది.

ALSO READ: 'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ & రేటింగ్!