ENGLISH

'వైల్డ్ డాగ్' ట్రైల‌ర్ విడుద‌ల‌ తేదీ

07 March 2021-18:32 PM

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకొని రాసిన క‌థ‌తో అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ అనే ఒక వైవిధ్య‌మైన పాత్ర‌లో నాగార్జున క‌నిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

ఇప్ప‌టివ‌ర‌కూ, సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ప‌రిచ‌యం చేస్తూ పోస్ట‌ర్ల‌ను మాత్ర‌మే చిత్ర బృందం విడుద‌ల చేసింది. అవి ఆడియెన్స్‌లో సినిమాపై మంచి క్యూరియాసిటీని రేకెత్తించాయి. ఇప్పుడు ఈ సినిమా దేని గురించ‌నే విష‌యాన్ని వెల్ల‌డించే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

 

నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా మార్చి 12 సాయంత్రం 4:05 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను కూడా షేర్ చేశారు. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు.

ALSO READ: నెట్ ఫ్లిక్స్‌కి న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చారా?