ENGLISH

Yash, Shankar: మ‌రో సూపర్ కాంబోకి అంతా రెడీ!

18 September 2022-13:26 PM

చిత్ర‌సీమ‌లో మ‌రో క్రేజీ కాంబోకి అంకురార్ప‌ణ జ‌ర‌గ‌బోతోంది. ద‌క్షిణాదిలో నెంబ‌ర్ దర్శ‌కుడిగా పేరొందిన శంక‌ర్‌, కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన య‌శ్ ఈసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్నారు. అవును.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ న‌టించ‌డానిక ఇఒప్పుకొన్నాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ పాన్ ఇండియా మూవీని క‌ర‌ణ్ జోహార్‌, పెన్ మీడియా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని, నెట్ ఫ్లిక్స్ కూడా వీరితో చేతులు క‌ల‌ప‌బోతోంద‌ని టాక్‌.

 

త‌మిళ న‌వ‌ల `వ‌ల్ప‌రి` ఆధారంగా ఈ సినిమా తీస్తున్నార‌ని తెలుస్తోంది. త‌మిళ సాహిత్యంలో `వ‌ల్ప‌రి`కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ న‌వ‌ల‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు కూడా వ‌చ్చింది. చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే ఈ న‌వ‌ల అంటే శంక‌ర్‌కు చాలా ఇష్ట‌మట‌. అందుకే ఈ న‌వ‌ల‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్‌. శంక‌ర్ చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలున్నాయి. రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

 

క‌మ‌ల్ హాస‌న్ తో భార‌తీయుడు 2 ని కూడా ఆయ‌న రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవి రెండూ పూర్త‌యిన త‌ర‌వాతే... య‌శ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

ALSO READ: Sita Ramam: సీతారామం సీక్వెల్‌కు సల్మాన్ బ్రేకులు