ENGLISH

చిరుతో కాదు... అల్లు అర్జున్‌తో..?!

03 May 2021-13:31 PM

త‌మిళ స్టార్ల‌తో.. సూప‌ర్ హిట్లు కొట్టిన మురుగ‌దాస్‌... తెలుగులో మాత్రం బోల్తా ప‌డ్డాడు. చిరంజీవితో చేసిన స్టాలిన్ ఫ్లాప్‌. మ‌హేష్ బాబుతో చేసిన `స్పైడ‌ర్‌` అయితే డిజాస్ట‌ర్‌. తెలుగు ప్రేక్ష‌కుల ప‌ల్స్‌ని మురుగ‌దాస్ ఎందుకు ప‌ట్టుకోలేక‌పోయాడా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అయితేఇప్ప‌టికీ మురుగ‌దాస్ తో సినిమాలు చేయ‌డానికి మ‌న హీరోలు రెడీగానే ఉన్నారు.

 

చిరంజీవితో మురుగ‌దాస్ మ‌ళ్లీ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఈసారి గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ని ప్రచారం జ‌రిగింది. చిరు కి ఈసారి ఎలాగైనా మురుగ‌దాస్ హిట్ ఇస్తాడ‌న్న భ‌రోసా.. మెగా ఫ్యాన్స్ లో క‌లిగింది. మురుగ‌దాస్ మ‌ళ్లీ తెలుగులో ఓ సినిమా చేయ‌డం దాదాపుగా ఖాయ‌మైంది. అయితే... హీరో చిరంజీవి కాదు.. అల్లు అర్జున్‌.

 

బ‌న్నీతో మురుగ‌దాస్ ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నాడ‌ని, బ‌న్నీ కూడా మురుగ‌దాస్ తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని, ఈ సినిమా గీతా ఆర్ట్స్‌లోనే మొద‌ల‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్. బ‌న్నీ ప్ర‌స్తుతం `పుష్ష‌`తో బిజీ. ఆ త‌ర‌వాత‌.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేదు. ఆ స్థానంలో మురుగ‌దాస్ సినిమా ఓకే అవుతుందేమో చూడాలి.

ALSO READ: వ‌రుణ్ సందేశ్‌... ఏమిటీ మేకోవ‌ర్‌?