గోపీచంద్ - నయనతార కలిసి నటించిన `ఆరడుగుల బుల్లెట్` సినిమా గుర్తుంది కదా. బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదల కావాల్సిన సినిమా ఇది. ఇప్పటి వరకూ మోక్షం దొరకలేదు. పలుసార్లు విడుదల తేదీ ప్రకటించారు. కానీ... ఏదో ఓ అవాంతరం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ చేస్తున్నామన్నారు గానీ, డేట్ మాత్రం బయటకు రాలేదు. నిజానికి ఇప్పటికీ ఈ సినిమా విడుదల కాదట.
కేవలం ఎనౌన్స్మెంట్ చేశారంతే. దానికీ ఓ కారణం ఉంది. ఈసినిమా విడుదల చేస్తున్నాం అని తెలిస్తే... ఓటీటీ ఆఫర్లు వస్తాయన్నది నిర్మాతల ప్లాన్. `మీ సినిమాని ఓటీటీకి ఇచ్చేయండి` అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయని, ఆ రకంగా కాస్త గట్టెక్కొచ్చన్నది నిర్మాతల ప్లాన్. కానీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ఇన్ని రోజులైనా, ఓటీటీల నుంచి ఎలాంటి ఆఫర్లూ రాలేదట. దాంతో... నిర్మాతలు ఉస్సూరుమంటున్నారు.
నిజానికి రెండేళ్ల క్రితం ఈ సినిమాని మంచి ఓటీటీ బేరం వచ్చింది. అప్పుడు వదిలించుకుంటే, ఈపాటికి నిర్మాతలు సేఫ్ అయిపోదురు. కానీ.. అప్పట్లో ఈ సినిమాని ఓటీటీకి అమ్మలేదు. ఇప్పుడు అమ్ముదామన్నా ఎవరూ కొనడం లేదు. అలా... ఈ బుల్లెట్ కి మెల్లమెల్లగా చదలు పట్టేశాయి. ఇప్పుడు గన్ లోంచి బయటకు వచ్చినా పేలేంత శక్తి ఉండకపోవొచ్చు.
ALSO READ: Nayanthara Latest Photoshoot