ENGLISH

ఆచార్య‌.. మ‌రీ అంత లేటా..?

26 April 2021-12:42 PM

క‌రోనా పుణ్య‌మా అని... ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ మ‌ట్టికొట్టుకుపోయింది. ఈ వేస‌విలో రావాల్సిన పెద్ద సినిమాల‌న్నీ మూకుమ్ముడిగా వాయిదా ప‌డ్డాయి. అందులో మెగాస్టార్ `ఆచార్య‌` ఒక‌టి. మే 13న రావాల్సిన సినిమా ఇది. అయితే... క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సివ‌స్తోంది. అయితే `ఆచార్య‌` త‌దుప‌రి డేట్ ఎప్పుడ‌న్న‌దానిపై ఇప్ప‌టికి ఎలాంటి స్ప‌ష్ట‌తా లేదు. మే కాక‌పోతే.. జూన్‌, జూన్ కాక‌పోతే... జులై అని స‌ర్దుకోవ‌డానికి కూడా లేదు. ఎందుకంటే `ఆచార్య‌` షూటింగ్ ఇంకా బాకీ వుంది. అదెప్పుడు పూర్తవుతుందో చెప్ప‌లేరు.

 

అందుకే కొర‌టాల కూడా రిలీజ్‌డేట్ టార్గెట్ పెట్టుకుని, టెన్ష‌న్ తెచ్చుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఎలాగూ లేట్ అయ్యింది క‌దా... అని తీరిగ్గా సినిమా పూర్తి చేసి తీసుకొద్దామ‌నుకుంటున్నాడు. ఇప్ప‌టికైతే.. ఆగ‌స్టు 22న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యార్ట‌. అది చిరు పుట్టిన రోజు. కాబ‌ట్టి.. మెగా ఫ్యాన్స్ కి గిఫ్టుగా ఇచ్చినట్టు ఉంటుంది. కాక‌పోతే... మేలో అనుకున్న సినిమా ఆగ‌స్టు అంటే.. మూడు నెల‌లు లేట‌న్న‌మాట‌. ఇంత ఆల‌స్యాన్ని మెగా ఫ్యాన్స్ భ‌రిస్తారా?

ALSO READ: శ‌భాష్ త‌మ‌న్‌.. మ‌న‌సుల్ని గెలిచేశావ్!