ENGLISH

చిరుకి ఇంకా మూడ్ రాలేదు.. 'ఆచార్య‌' డౌటే!

16 October 2020-10:00 AM

లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయిన షూటింగులు ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ మొద‌ల‌వుతున్నాయి. బ‌డా స్టార్లు సైతం... షూటింగుల‌కు రెడీ అవుతున్నారు. దాంతో... టాలీవుడ్ ఇప్పుడు క్లాప్ ల మోత మోగుతోంది. `యాక్ష‌న్‌` హంగామా క‌నిపిస్తోంది. చిరంజీవి `ఆచార్య‌` షూటింగ్ కూడా అక్టోబ‌రులోనే మొద‌లువుతుంద‌ని అనుకున్నారు. అక్టోబ‌రు మొద‌టి వారంలో షూటింగ్ కి అంతా రెడీ అయిపోయింద‌ని, చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ని, ఆ త‌ర‌వాత‌.. చిరు సెట్లో అడుగుపెడ‌తార‌ని అనుకున్నారు. అయితే...ఇప్ప‌టి వ‌ర‌కూ `ఆచార్య‌` షూటింగ్ మొద‌లు కాలేదు.

 

త్వ‌ర‌లో మొద‌ల‌వుతుంద‌న్న ఆశ‌లూ లేవు. ఎందుకంటే.. చిరుకి ఇప్పుడు షూటింగ్ మూడ్ లేద‌ట‌. `ఇంకొంత కాలం ఎదురు చూద్దాం` అని కొర‌టాల శివ‌కు చిరు సూచించాడ‌ట‌. ఏపీ, తెలంగాణ‌ల‌లో క‌రోనా ఇంకా ఉధృతంగానే వుంది. దానికి తోడు భారీ వ‌ర్షాలు. అందుకే చిరంజీవి ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం అని చెప్పాడ‌ట‌.

 

తాజా ప‌రిణామాల దృష్ట్యా చూస్తే న‌వంబ‌రు వ‌ర‌కూ షూటింగ్ మొద‌లు కాక‌పోవొచ్చ‌ని అనిపిస్తోంది. 2021 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేద్దామ‌ని కొర‌టాల భావించాడు. షూటింగ్ ఇలా ఆల‌స్యం అవుతూ ఉంటే, వేస‌వికి ఆచార్య డౌటే.

ALSO READ: మామా - కోడ‌ళ్లు బాగా బాదేస్తున్నారు!