ENGLISH

మ‌హ‌మ్మారి... మ‌రో న‌టుడ్ని మింగేసింది

24 September 2020-09:30 AM

`పిల్ల జమిందార్`, `మర్యాద రామన్న`, `విక్రమార్కుడు`, `అమీతుమీ`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించిన కోసూరి వేణుగోపాల్ ఇక లేరు. క‌రోనా తో బాధ‌ప‌డుతూ ఆయ‌న క‌న్ను మూశారు. కోవిడ్ సోక‌డంతో గ‌త కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వేణుగోపాల్ బుధవారం రాత్రి మరణించారు.

 

కరోనా ని జ‌యించినా, త‌ద్వారా వ‌చ్చిన ఇత‌ర స‌మ‌స్య‌లు ఆయ‌న్ని క‌బ‌ళించాయి. వేణుగోపాల్ ది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నర్సాపురం. ఎఫ్‌సీఐ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. జూనియ‌ర్ ఆర్టిస్టు నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఎదిగారు. ఆయ‌న‌కు ఎక్కువ‌గా కామెడీ వేషాలే వ‌రించాయి. బుల్లి తెర‌పై కూడా న‌టించిన అనుభ‌వం ఉంది. వేణుగోపాల్ మృతికి చిత్ర‌సీమ సంతాపం వ్య‌క్తం చేసింది.

ALSO READ: డ్రగ్స్‌ రగడ.. ఎవరా ‘ఇంకో’ టాలీవుడ్‌ హీరోయిన్‌.?