ఒకప్పుడు సునీల్ కామెడీ పంచ్‌లంటే ఓ రేంజ్ ఉండేది. ఏ క్యారెక్టర్‌లో కనిపించినా తనదైన శైలిలో టైమింగ్ పంచ్‌లతో తన క్యారెక్టర్‌ని హైలైట్ చేసుకునేవాడు సునీల్. కానీ, హీరో అయ్యాకా యాక్టింగ్‌లోని వేరియేషన్స్ చూపించగలిగాడు కానీ, గత ఇమేజ్‌ని కోల్పోయాడు. ఎన్ని వేరియేషన్స్ చూపించినా, ఎంత బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చినా ఊహూ.. సునీల్‌ని హీరోగా ఒకట్రెండు సినిమాలకు తప్ప, అంతకన్నా ఎక్కువ యాక్‌సెప్ట్ చేయలేకపోయారు.
ఇక విషయం తెలుసుకున్న సునీల్ హీరో మెట్టు దిగి, కమెడియన్ మెట్టుకే వచ్చేశాడు. అయితే, ఇదివరకటిలా సునీల్ కోసం కామెడీ పంచ్‌లు రాయలేకపోతున్నారు మన రైటర్లు. వారు రాసిన కామెడీ డైలాగ్స్ తెరపై అంతలా పేలడం లేదు కూడా. అస్సలు సునీల్ క్యారెక్టర్ ఎలివేట్ కావడం లేదు కూడా. ఈ మధ్య వరుస సినిమాల్లో సునీల్ కనిపిస్తూనే ఉన్నాడు. కానీ, ఎక్కడా సునీల్ క్యారెక్టర్ హైలైట్ కాలేదు. ఆఖరికి ఆయన రూమ్ మేట్ త్రివిక్రమ్ సినిమాల్లో కూడా సునీల్ క్యారెక్టర్ పేలడం లేదంటేనే అర్ధం చేసుకోవాలి.
సునీల్ తన కెరీర్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని. అయితే, 'అల..' లో ఆఫీస్ సీన్‌లో బన్నీతో కలిసి సునీల్ వేసిన డాన్స్ స్టెప్పులు బాగా కిక్కెక్కించాయి. కానీ ఏం లాభం..? ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ రోల్‌కీ, పోజిటివ్ రోల్‌కీ మధ్య ఏం రోల్ చేశాడనే సందిగ్ధంలో నలిగిపోయాడు. ఇక తాజాగా బాలకృష్ణ - బోయపాటి సినిమాలో సునీల్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అదయినా హిట్టవుతుందా.? చూడాలి మరి.
ALSO READ: అఖిల్ టైటిల్ అదేనా?