ENGLISH

విశాల్ కి గాయం... షూటింగ్ లో ప్ర‌మాదం

21 July 2021-13:22 PM

షూటింగుల్లో హీరోలు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో. ఇటీవ‌ల‌... చాలామంది హీరోలు యాక్ష‌న్ ఎపిసోడ్లు చేస్తూ గాయ‌ప‌డ్డారు. తాజాగా ఈ జాబితాలో విశాల్ చేరాడు. విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `నాట్ ఏ కామ‌న్ మాన్‌`. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో తెర‌కెక్కిస్తున్నారు. సంద‌ర్భంగా.. విశాల్ గాయ‌ప‌డ్డాడు.

 

ఓ ఫైట‌ర్‌... విశాల్ ని గోడ‌వైపుకు తోసే స‌న్నివేశం చిత్రీక‌రిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విశాల్ వెన్నెముక కాస్త చిట్లింద‌ని స‌మాచారం. దాంతో... విశాల్ ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే విశాల్ స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని విశాల్ సన్నిహితులు చెబుతున్నారు. ఇది వ‌ర‌కు కూడా... ఇదే సినిమా షూటింగ్ లో విశాల్ గాయ‌ప‌డ్డాడు. అప్పుడు కంటి భాగానికి గాయ‌మైంది. ఇప్పుడు ఇది రెండోసారి.

ALSO READ: నితిన్ తో కృతి శెట్టి