'ఆదిపురుష్' తెలుగు రైట్స్‌ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకొన్న సంగతి తెలిసిందే. ఏకంగా రూ.170 కోట్లు పెట్టి రైట్స్ తీసుకొంది. నిజంగా ఇది పెద్ద డీల్. సినిమా హిట్టయితే.. దాన్ని రాబట్టుకోవడం అంత కష్టమేం కాదు. కానీ... ఆదిపురుష్ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయింది. పైగా బోలెడన్ని విమర్శలు, వివాదాలూ. ఫస్ట్ వీకెండ్ లో తెలుగు నుంచి రూ.100 కోట్లు వస్తే గొప్ప. ఈవారం కొత్త సినిమాలేం లేవు. కాబట్టి శని, ఆదివారాలు మళ్లీ థియేటర్ల దగ్గర క్రౌడ్ ని చూడొచ్చు. ఎలా చూసినా మరో రూ.10 లేదా రూ.20 కోట్లు వస్తాయంతే. అంటే... అటూ ఇటుగా రూ.50 కోట్లు లాస్.
ఈ లాస్ ని సైతం పీపుల్స్ మీడియా పై ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే ప్రభాస్ తదుపరి సినిమా 'స్పిరిట్' హక్కులు కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాయి. 'ఆదిపురుష్'తో పోయింది... `స్పిరిట్` తో తిరిగి దక్కించుకోగలదు. అన్నింటికి మించి... ప్రభాస్‌తో పీపుల్స్ మీడియా ఓ సినిమా చేస్తోంది. మారుతి దర్శకుడు. ఈ రెండు సినిమాలపై ఉన్న గురితోనే.. 'ఆదిపురుష్' రైట్స్‌ని అంత రేటుకి కొనేసింది పీపుల్స్ మీడియా. సో.. ఇక్కడ పోయింది, అక్కడ రాబట్టుకోనే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.