ENGLISH

ఆరు నెల‌లు ఆదిపురుష్‌కే!

19 November 2020-12:00 PM

ఈ రోజు ఆదిపురుష్‌కి సంబంధించిన ఓ కీ అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాని 2022 ఆగ‌స్టు 11న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడు. ఓం రౌత్ ద‌ర్శ‌కుడు. జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.

 

దాదాపు 450 కోట్ల‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. భారీ వ్య‌య ప్ర‌యాస‌ల‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌... సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌యం. అంతే కాదు... ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ఆరు నెల‌ల కాల్షీట్లు కేటాయించ‌బోతున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి నుంచి జూన్ - జులై వ‌ర‌కూ `ఆదిపురుష్‌` ప‌నుల్లోనే ఉంటాడు ప్ర‌భాస్‌. ఆ త‌ర‌వాతే.. నాగ అశ్విన్ సినిమా ప్రారంభం అవుతుంది. వీఎఫ్ఎక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉన్న చిత్ర‌మిది. 2021 నాటికి.. షూటింగ్ మొత్తం పూర్తువుతుంది. మ‌రో ఆరేడు నెల‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతాయి. ఈ సినిమాలో సీత ఎవ‌ర‌న్న విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈనెల‌లోనే క‌థానాయిక‌ని ఫైన‌ల్ చేసే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: డిసెంబ‌రు కూడా మ‌ర్చిపోవాల్సిందేనా?