ENGLISH

మేజ‌ర్ కి బంప‌ర్ ఆఫ‌ర్‌...!

02 July 2021-11:00 AM

థ్రిల్ల‌ర్ స్టార్‌... అడ‌విశేష్‌. క్ష‌ణం, గూఢ‌చారి లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మేజ‌ర్ సినిమాతో. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ హ‌క్కులు ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయి. ఇప్పుడు హిందీ శాటిలైట్ కీ మంచి రేటే ప‌లికింది. ఓ ఛాన‌ల్ ఏకంగా రూ.10 కోట్ల‌కు శాటిలైట్ రేట్లు కొనుక్కున్న‌ట్టు స‌మాచారం.

 

మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ముంబైలోని తాజ్ హోటెల్ పై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అక్క‌డ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది ఉన్ని కృష్ణ‌న్‌నే. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో శోభిత‌, ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ తో క‌లిసి మ‌హేష్ బాబు నిర్మిస్తుండ‌డం విశేషం. జులై 2న విడుద‌ల కావాల్సివుంది. కానీ.. ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో వాయిదా ప‌డింది.

ALSO READ: త‌మిళ ద‌ర్శ‌కుడి వైపు.. బ‌న్నీ చూపు?!