ENGLISH

ఈ వారం కూడా బాలయ్యదే

07 December 2021-18:00 PM

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. థియేటర్స్ ఒక్కసారిగా కళకళలాడాయి. థియేటర్ లో మాస్ జాతర జరుగుతుంది. అయితే ఈ వారం మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. నాగశౌర్య ‘లక్ష్యం’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. కేతిక శర్మ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో రూపొందిన చిత్రమిది. వరుడుకావలెను తర్వాత శౌర్య నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే శౌర్య సిక్స్ ప్యాక్ లో దర్శనమివ్వడం .. ఈ సినిమా ఆసక్తిని పెంచింది.

 

శ్రియ ప్రధాన పాత్రలో నటించిన ‘గమనం’ కూడా విడుదలకు రెడీ అయ్యింది. నిత్యా మేనన్‌, ప్రియాంక జవాల్కర్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం. శ్రియ ఛాలెంజింగ్ పాత్రలలో కనిపించడం, కాన్సెప్ట్ కొత్తగా వుండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీంతో పాటు ‘నయీం డైరీస్‌’ , ‘మడ్డీ’, బుల్లెట్‌ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ సినిమాలు కూడా థియేటర్ లోకి వస్తున్నాయి. అయితే ఇందులో శౌర్య లక్ష్య పై ఒక్కింత ఆసక్తి వుంది. అయితే ఇది మాస్ సినిమా కాదు. ప్రస్తుతం బాలయ్య అఖండ ఒక్కటే క్రౌడ్ ఫుల్లర్ సినిమాగా నడుస్తుంది. ఈ వారం కూడా అన్నీ మీడియం సినిమాలు రావడంతో బాలయ్య అఖండ బాక్సాఫీసు మరింత సందడి చేసే ఛాన్స్ వుందని చెప్పాలి.

ALSO READ: RRR పై పూజా కామెంట్‌!