ENGLISH

స్టైలిష్‌ అండ్‌ రొమాంటిక్‌ అఖిల్‌

19 August 2017-11:57 AM

అఖిల్‌ కొత్త సినిమా 'మనం' డైరెక్టర్‌ విక్రమ్‌.కె.కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అఖిల్‌కి సెకండ్‌ లాంఛింగ్‌ మూవీగా అభివర్ణించాడు నాగార్జున. ఆయనే ఈ సినిమాకి నిర్మాతగా పని చేస్తున్నారు కూడా. అయితే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ లీక్‌ అవడం సంచలనంగా మారింది. నిర్మాత అక్కినేని నాగార్జున మాత్రం ఈ లీకేజీని అడ్వాన్స్‌డ్‌గా తీసుకుని, లీక్‌ అయితేనేం, ఫుల్‌ క్వాలిటీతో కూడిన లుక్‌ చూడమంటూ సోషల్‌ మీడియాలో ఒరిజినల్‌ లుక్‌ని విడుదల చేశాడు. లుక్‌ మాత్రం అదిరిపోయింది. ఓ పక్క యాక్షన్‌, మరో పక్క రొమాన్స్‌ రెండూ ఒకేసారి చేసేస్తున్నాడు మనోడు ఈ లుక్‌లో. సూపర్బ్‌ లుక్‌. ఫుల్‌ క్వాలిటీ. లీక్‌ అయితే అయ్యింది కానీ, అఖిల్‌ లుక్‌ బయటికి రావడంతో అక్కినేని అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు. ఏది ఏమైనా లీకు వీరుల్ని మాత్రం అస్సలు క్షమిచకూడదు. మానసిక రోగుల్లా భావించాల్సి ఉంటుంది అలాంటి వాళ్లని. కోట్లు వెచ్చించి, సినిమానే ప్రాణంగా భావించి, ఆ సినిమా కోసం పనిచేసే క్రియేటివ్‌ పీపుల్‌ క్రియేటివిటీని దొంగతనం చేయడం రోగం కాక మరేమిటి? ఎన్నో ఆశలతో చిత్ర యూనిట్‌ లుక్స్‌ని రిలీజ్‌ చేయాలనుకుంటారు. మంచి రోజు, మంచి ముహూర్తం కలిసొచ్చే క్షణం రకరకాల సెంటిమెంట్స్‌ ఉంటాయి. కానీ ఇలా అనూహ్యంగా లీకయిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయమే. కానీ చేసేది లేదు. ఏదేమైనా అఖిల్‌ లుక్‌ మాత్రం అదిరిపోయింది. కళ్యాణీ ప్రియదర్శిని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: ఒక సూపర్ స్టార్ కోసం మరో సూపర్ స్టార్