అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ప్రోడక్షన్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మాతలు బన్నీవాసు , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" గా టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ తెలిపింది. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వంటి యూత్ ఫుల్ టైటిల్ కి తగినట్లుగానే ఈ సినిమా యూత్ ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే రీతిన రెడీ అవుతుంది అని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
అక్కినేని నాగేశ్వరావు గారి, అక్కినేని నాగార్జున గారి నట వారసుడుగా పరిచయమైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తను చేసిన హలో, మిస్టర్ మజ్జూ లాంటి లవ్ కమ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్స్ తో అక్కినేని అభిమానులనే కాకుండా ఫ్యామిలి అండ్ గర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బొమ్మరిల్లు చిత్రం ఇప్పటికి ట్రెండ్ సెట్టర్ ఇన్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా నిలిచిపోయిందంటే అది కేవలం దర్శకుడు భాస్కర్ విజన్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ తరువాత వచ్చిన పరుగు చిత్రం ప్రతి ఓక్కరిని ఆలోచింపచేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో భాస్కర్ ది సెపరేటు ఇమేజ్ వుంది. ఇప్పడు వీరద్దిరి కాంబినేషన్ లో చిత్రం అనగానే ఈ క్రేజ్ మరింత పెరిగింది.
గతం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% లవ్.. ఈ చిత్రం లో అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వం లో బన్ని వాసు నిర్మించాడు. ఆ చిత్రం చాలా మంచి విజయాన్ని సాధించటం విశేషం.. మళ్ళి ఇప్పుడు అక్కినేని వారి మరో నట వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా, నిర్మాతలు బన్ని వాసు, వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు, పరుగు లాంటి ట్రెండ్ సెట్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన భాస్కర్ దర్శకత్వం చేస్తున్నారు.
ALSO READ: మెట్టు దిగినా క్యారెక్టర్ హిట్టు కాదే!