ENGLISH

కండ‌ల‌తో క‌ట్టిప‌డేస్తున్న అఖిల్‌!

12 July 2021-11:40 AM

తొలి సినిమాలోనే కావ‌ల్సిన దానికంటే ఎక్కువ `యాక్ష‌న్‌` చేసేశాడు అఖిల్‌. అయితే ఆ త‌ర‌వాత రూటు మార్చి... ప్రేమ‌క‌థ‌ల్ని ఎంచుకున్నాడు. అదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. అందుకే మ‌రోసారి `యాక్ష‌న్‌` బాట ప‌ట్టాడు. యాక్ష‌న్ క‌థ‌ల్ని స్టైలీష్ గా తీసే సురేంద‌ర్ రెడ్డితో క‌లిసి చేస్తున్న సినిమా `ఏజెంట్`. ఇందులో అఖిల్ త‌న ఎయిట్ ప్యాక్ బాడీతో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు.

 

ఈసినిమా కోసం గ‌త రెండు నెల‌లుగా జిమ్ లో క‌ష్ట‌ప‌డుతున్నాడు అఖిల్. అందుకు త‌గిన అవుట్ పుట్ కూడా వ‌చ్చేసింది. కండ‌లు తిరిగిన దేహంతో.. మాన్లీ లుక్‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఇప్పుడు షూటింగ్ కి రెడీ అయ్యాడు. `ఏజెంట్` షూటింగ్ ఈరోజు నుంచి హైద‌రాబాద్ లో మొద‌లు కానుంది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ... ఏక‌ధాటిగా షూటింగ్ జ‌ర‌ప‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రంలో మ‌మ్ముట్టి ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తినాయ‌కుడిగా ఫాజ‌ల్ ఫాహిద్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

ALSO READ: రామారావుగా మారిపోయిన ర‌వితేజ‌