ENGLISH

అఖిల్‌ కలపాల్సిన పులిహోర చాలానే వుందట

16 November 2020-19:00 PM

అఖిల్‌ సార్థక్‌ని ఫేక్‌ ఎలిమినేషన్‌ ద్వారా సీక్రెట్‌ రూంలోకి ఎందుకు పంపించినట్లు.? అలా సీక్రెట్‌ రూంలోంచి హౌస్‌లో వున్నవారిని అబ్జర్వ్‌ చేస్తూ, ఆట కోసం తనదైన వ్యూహాలు రచించుకునే అవకాశం ఎందుకు ఇచ్చినట్లు.? మెబబూబ్‌ బయటకు వెళుతూ, ‘నువ్వు ఛాంపియన్‌’ అని అఖిల్‌ని ఉద్దేశించి ఎందుకు అన్నాడు? అంటే, ఇక్కడ బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌ ఎవరన్నది మెహబూబ్‌ ద్వారా బయటపెట్టేసినట్లున్నారు నిర్వాహకులు. మొదటి నుంచీ అఖిల్‌ విషయంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు చిత్రమైన ‘ఆట’ ఆడుతున్నారు.

 

అఖిల్‌ని వెనకేసుకొస్తూ వున్నారు. ఎప్పుడో ఎలిమినేట్‌ అవ్వాల్సినోడు, ఇన్ని రోజులు హౌస్‌లో కొనసాగడమే విచిత్రం. డైరెక్ట్‌గా కెప్టెన్‌ని చేసేసి, ఇంకో వారం అతన్ని సేవ్‌ చేసేశారు. సో, అఖిల్‌ బిగ్‌హౌస్‌లో ఇంకేదో పులిహోర కలపాల్సి వుందన్నమాట.. అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అఖిల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనే ముద్ర బిగ్‌బాస్‌ వెయ్యడం తప్ప, ఏ టాస్క్‌లోనూ అతను అంతగా ఆకట్టుకున్నది లేదు. మోనాల్‌తో పులిహోర కలపడం, అబిజీత్‌పై మాటలు విరసడం, సోహెల్‌ - మెహబూబ్‌లను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేయడం.. ఇలాంటి పనులు చాలానే చేశాడు అఖిల్‌ అనే ఆరోపణలున్నాయి.

 

సరే, హౌస్‌లో ఏం జరుగుతోంది.? అన్నదానికంటే, ఎలాంటి వీడియో పుటేజ్‌ ప్రసారమవుతోందన్నదానిబట్టే ఆయా కంటెస్టెంట్స్‌ క్యారెక్టర్‌ని ఆడియన్స్‌ జడ్జ్‌ చేస్తారు కాబట్టి, దేన్నీ అంత తేలిగ్గా మనం డిసైడ్‌ చేసెయ్యలేం. ఒక్కటైతే నిజం. అఖిల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ ఇప్పటికే ఎలిమినేట్‌ అయిపోయారు. అఖిల్‌ కొనసాగుతున్నాడంటే, ఏదో శక్తి అతని వెనకాల గట్టిగా పనిచేస్తోందనే అర్థం.

ALSO READ: మ‌ళ్లీ దొరికేసిన త‌మ‌న్‌