ENGLISH

వాళ్ళకి కంటతడి, అఖిల్‌కి అదో టైపు ఆనందం!

13 November 2020-14:00 PM

ఎవరన్నా ఏడుస్తోంటే, ఓదార్చాలని అనుకుంటాం. కానీ, అఖిల్‌ మాత్రం.. ఎవరన్నా ఏడిస్తే చూసి అదో టైపు ఆనందం పొందాలనుకుంటాడు.. ఇదీ నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ తర్వాత బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ వ్యక్తం చేస్తోన్న అభిప్రాయం. అందరిలోనూ కాదు, కడుపుబ్బా నవ్వించే అవినాష్‌ని ఏడిపించాలనుకున్నాడు.. హౌస్‌లో ఎప్పుడూ ఎనర్జీ డౌన్‌ అవకుండా వుండే అరియానాని ఏడిపించాలనుకున్నాడు అఖిల్‌. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ నేపథ్యంలో కంటెస్టెంట్స్‌కి వారి కుటుంబ సభ్యులు పంపిన లేఖల్ని ఇవ్వాల్సిన అఖిల్‌, ఈ క్రమంలోనూ రాజకీయాలు చేశాడు.

 

‘నాకు ముందే ఆ సీక్రెట్‌ చెప్పేశాడు కాబట్టి, అది సీక్రెట్‌ కాదు’ అని అవినాష్‌ లెటర్‌ని చింపేశాడు అఖిల్‌. అరియానా చెప్పిన సీక్రెట్‌, అఖిల్‌కి అర్థం కాలేదు.. అది అఖిల్‌ మిస్టేక్‌. కానీ, అఖిల్‌, అరియానా లెటర్‌ని కూడా చించేశాడు. తాను ఎమోషనల్‌ పర్సన్‌.. అంటూ గంగవ్వ చుట్టూ, మోనాల్‌ చుట్టూ, సోహెల్‌ చుట్టూ పులిహోర కలిపిన అఖిల్‌, కుటుంబ సభ్యుల లెటర్స్‌.. ఆయా కంటెస్టెంట్స్‌కి ఎంత ఎమోషనల్‌ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడం శోచనీయమే.

 

‘నా లెటర్‌ నాకు కావాలి బిగ్‌ బాస్‌.. ప్లీజ్‌ బిగ్‌ బాస్‌..’ అని వేడుకున్న అఖిల్‌కి తెలియదా, అవతలి కంటెస్టెంట్స్‌ కూడా అంతే ఆశగా ఆ లెటర్స్‌ కోసం ఎదురుచూస్తున్నారని. హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో గొడవపడటం వేరు, అవకాశం వచ్చినప్పుడు.. కంటెస్టెంట్స్‌కి వారి కుటుంబ సభ్యులతో ప్రేమని దూరం చేయడం వేరు. అఖిల్‌ ఈ విషయంలో చాలా పెద్ద తప్పే చేసేశాడు.

ALSO READ: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’: రాజమౌళి ఆ ‘క్లారిటీ’ ఎప్పుడిస్తాడో.!