ENGLISH

Akhil Akkineni: అఖిల్ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావ‌యా!

08 July 2022-11:00 AM

అఖిల్ కెరీర్ ఏమంత సాఫీగా సాగ‌డం లేదు. వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌' కాస్త ఓకే అనిపించింది. అయితే.. ఆ క్రెడిట్ కూడా పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `ఏజెంట్‌`పైనే ఆశ‌లు పెట్టుకొన్నాడు అఖిల్‌. మ‌మ్ముట్టి ఓ కీల‌క పాత్ర పోషించ‌డం, భారీ బ‌డ్జెట్ కేటాయించ‌డం ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్‌.

 

అయితే... `ఏజెంట్` షూటింగ్ అంత స‌జావుగా జ‌ర‌గ‌డం లేదు. ఈ సినిమాని ఆగ‌స్టులో విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. అయితే ఆ త‌ర‌వాత వాయిదా వేశారు. ద‌స‌రాకి ఈ సినిమాని విడుద‌ల చేద్దామ‌ని ఫిక్స‌య్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబ‌రుకి మారింద‌ని టాక్‌. సురేంద‌ర్ రెడ్డి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ టైపు. త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ‌చ్చేంత వ‌ర‌కూ సీన్స్ తీస్తూనే ఉంటాడు.

 

ఈ సినిమాకి సంబంధించి రీషూట్లు చాలా జ‌రిగాయ‌ని, అందుకే సినిమా ఆల‌స్య‌మ‌వుతూ వెళ్తోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అస‌లే అఖిల్ మార్కెట్ అంతంత మాత్ర‌మే. దానికి తోడు.. భారీ బ‌డ్జెట్ సినిమా ఇది. ఇప్పుడు రీషూట్ల వ‌ల్ల ఆ బ‌డ్జెట్ మ‌రింత పెరుగుతుంది. దాంతో పాటు వ‌డ్డీలు కూడా. ఇలానే సినిమాని వాయిదా వేసుకుంటూ పోతే.. త‌డిసిమోపెడ‌వ్వ‌డం ఖాయం.

ALSO READ: ఏలూరు నుంచి అంబికా కృష్ణ పోటీ?!