ENGLISH

పూజా హెగ్డే తో చుచ్చుబిడ్డి వెలిగించిన అఖిల్!

13 November 2020-18:00 PM

అఖిల్ అక్కినేని ఈ మ‌ద్యే మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని అడుగుతూ త‌న టీజ‌ర్ ని అంద‌రి అంచ‌నాలు అందుకేనేలా చేశాడు. ఇప్ప‌డు దీపావ‌ళికి చుచ్చుబ‌డ్డి ని పూజా తో వెలిగించేసి అంద‌ర్ని ఆక‌ట్ట‌కున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్శ‌తో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌లర్.

 

ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్ధే న‌టిస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీతాగొవిందం చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన‌ గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ల మ‌ద్య వున్న కెమిస్ట్రి ఈ దివాళి పోస్ట‌ర్ తో తెలిసేలా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న‌దైన శైలిలో అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అంద‌రూ ఆక‌ట్టుకునే రీతిలో డిజైన్ చేశారు. దిపావళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ రోజు ఈ క‌ల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది.

ALSO READ: Pooja Hegde