ENGLISH

ఏజెంట్ అద‌ర‌గొట్టేశాడు

08 April 2021-11:28 AM

అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌వ‌ర్ బోయ్ త‌ర‌హా పాత్ర‌లే పోషించాడు. తెర‌పై చాక్లెట్ బోయ్ లా అందంగా క‌నిపించాడు. అఖిల్ ర‌ఫ్ లుక్ ఎలా ఉంటుంది? గ‌డ్డం పెంచితే ఎలా క‌నిపిస్తాడు? చేతిలో సిగ‌రెట్ ఉంటే ఎంత మాసీగా ఉంటాడు? ఈ విష‌యాలు తెలియాలంటే `ఏజెంట్` పోస్ట‌ర్ చూడాల్సిందే. సురేంద‌ర్ రెడ్డి - అఖిల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే.

 

ఈచిత్రానికి `ఏజెంట్` అనే పేరు ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. ఒత్తైన జుత్తు, గ‌డ్డం, చేతిలో సిగ‌రెట్, క‌ళ్ల‌లో.. తీక్ష‌ణ‌త‌తో... అఖిల్ చాలా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. త‌న హీరోల్ని స్టైలీష్ గా ప్ర‌జెంట్ చేయ‌డంలో సురేంద‌ర్ రెడ్డి ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటారు. అఖిల్ విష‌యంలోనూ అదే క‌నిపిస్తోంది. క‌థా క‌థ‌నాల మాట ఎలా ఉన్నా... ఏజెంట్ గా అఖిల్ చాలా కొత్త‌గా క‌నిపిస్తాడ‌న్న భ‌రోసా అయితే దొరికింది.

ALSO READ: స్టైలీష్ స్టార్ కాదు... ఐకాన్ స్టార్‌‌