ENGLISH

ఆ సినిమాతో అఖిల్ ఇమేజ్ మార‌బోతోందా?

05 September 2020-14:00 PM

తొలి మూడు సినిమాలూ ఫ్లాప్ అయినా.. ప్రేమ‌క‌థ‌ల‌కు స‌రిపోతాడ‌న్న పేరు తెచ్చుకోగ‌లిగాడు అఖిల్‌. ఇప్పుడు చేస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` కూడా ల‌వ్ స్టోరీనే. త్వ‌ర‌లో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు అఖిల్. ఈసినిమాతో అయినా త‌న‌కంటూ ఓ ఇమేజ్ వ‌స్తుంద‌ని ఆశ ప‌డుతున్నాడు. సురేంద‌ర్ రెడ్డి యాక్ష‌న్ సినిమాలు తీయ‌డంలో దిట్ట‌. ఇది కూడా అలాంటి క‌థే అని తెలుస్తోంది.

 

ఈ సినిమాని ఓ స్టైలీష్ ఎంట‌ర్‌టైన‌ర్ గా మ‌ల‌చ‌డానికి సురేంద‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని స‌మాచారం. అందుకే ఈ సినిమాకి 45 కోట్ల బడ్జెట్ అవ్వ‌బోతోంద‌ట‌. అయితే.. అఖిల్ ఇప్ప‌టికీ ల‌వ‌ర్ బోయ్‌గానే క‌నిపిస్తుంటాడు. తొలి సినిమాతోనే భ‌యంక‌ర‌మైన‌... బీభ‌త్స‌మైన యాక్ష‌న్ విన్యాసాలు చేసినా, అవెందుకో ఎక్క‌లేదు. మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుందేమో అన్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. సురేంద‌ర్ రెడ్డి త‌న క‌థ‌తో, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ తో ఏదో ఓ మ్యాజిక్ చేస్తాడ‌ని ఫ్యాన్స్ న‌మ్ముతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: ఆల‌స్యం విలువ ఆరు కోట్లు