ENGLISH

మొన్న నాగ్‌.. నిన్న చైతూ.. నేడు అఖిల్‌

14 September 2020-17:01 PM

టాలీవుడ్ లో మ‌ళ్లీ షూటింగుల సంద‌డి మొద‌లైంది. వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాల్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి నిర్మాత‌లు రెడీ అవుతున్నారు. ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి.. హీరోలు రిస్క్ చేసి మ‌రీ షూటింగుల‌కు సై అంటున్నారు. అందులో భాగంగా తొలి అడుగు వేశారు నాగార్జున‌. `వైల్డ్ డాగ్‌` షూటింగ్ సెట్లో అడుగుపెట్టి, మిగిలిన హీరోల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆ వెంట‌నే నాగ‌చైత‌న్య సినిమా `ల‌వ్ స్టోరీ` మొద‌లైంది. ఇప్పుడు అఖిల్ కూడా త‌న ప‌ని మొద‌లెట్టేశాడు.

 

అఖిల్ - బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం `మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` పూజా హెగ్డే క‌థానాయిక‌. కరోనా వైరస్‌ కారణంగా ఆగిపోయిన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమా షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఈనెలాఖ‌రుకి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ప్ర‌స్తుతం పూజా హెగ్డేపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ నెల 20 నుంచి అఖిల్ సెట్లో అడుగుపెడ‌తాడు. జనవరి 6న విడుదల చేసేలా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: సుశాంత్ డ్ర‌గ్స్ తీసుకునేవాడా? కాదా?