ENGLISH

ఆ యంగ్‌ హీరోస్‌కి 'అల' ఎలా వర్కవుట్‌ అయ్యిందంటే.!

29 January 2020-11:00 AM

ఒకప్పుడు సోలో హీరోగా అమ్మాయిల మనసులో రొమాంటిక్‌ బాయ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న హీరో నవదీప్‌కి ఇప్పుడు సోలో హీరోయిజం వర్కవుట్‌ కావడం లేదు. దాంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయాడు. అప్పుడెప్పుడో 'ధృవ' సినిమాలో చరణ్‌కి ఫ్రెండ్‌ పాత్రలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించాడు. ఆ పాత్ర నవదీప్‌కి మంచి పేరు తీసుకొచ్చింది కూడా. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తదితర స్టార్‌ హీరోల సినిమాల్లో నటించాడు. లేటెస్ట్‌గా అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో..' సినిమాలో నటించాడు. అయితే, నవదీప్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. నవదీప్‌ అండ్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ స్టంట్‌ సీన్‌ కూడా ఉన్నప్పటికీ అక్కడెక్కడా నవదీప్‌ హైలైట్‌ కాలేదు.

 

సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది కానీ, నవదీప్‌ని డైరెక్టర్‌ సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తున్నారు. దాంతో నవదీప్‌ కెరీర్‌కి 'అ..' సూపర్‌ హిట్‌ ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో నటించిన మరో యంగ్‌ హీరో సుశాంత్‌కి మంచి పాత్రే దక్కింది. దాదాపు అల్లు అర్జున్‌తో ఈక్వెల్‌ ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రది. సుశాంత్‌కి జోడీగా హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ కూడా ఉంది. అయినా ఈ సినిమా తర్వాత సుశాంత్‌కి ఆ తరహా పాత్రల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. సో నవదీప్‌తో పోల్చితే, ఎంతో కొంత సుశాంత్‌కి 'అల..' వర్కవుట్‌ అయినట్లేనేమో.

ALSO READ: అనుష్క 'నిశ్శబ్ధం'గా ఉండిపోయిందే!