ENGLISH

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అలియా ఉన్నట్టేనా?

25 August 2020-14:08 PM

రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న మ‌రో భారీ సినిమా... ఆర్‌.ఆర్‌.ఆర్. ఈ సినిమా మొద‌లై.. చాలా కాలం అయ్యింది. దాదాపు స‌గానికి పైగానే షూటింగ్ పూర్త‌యింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా సెట్లో క‌థానాయిక అలియాభ‌ట్ అడుగుపెట్ట‌లేదు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో అలియాని ఈ టీమ్ నుంచి తొల‌గించార‌ని, ఆ స్థానంలో మ‌రో బాలీవుడ్ క‌థానాయిక‌ని తీసుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. బాలీవుడ్ మీడియా కూడా ఈ విష‌యంపై పెద్ద ఎత్తున వార్త‌లు రాసింది. మీడియాలో ప్ర‌త్యేక క‌థ‌నాలు వచ్చాయి.

 

దీనిపై అలియా భ‌ట్ స్న‌నిహిత వ‌ర్గాలు స్పందించాయి. అలియా ఇంకా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` టీమ్ తోనే ఉంద‌ని, ఆమెను ఈ సినిమా నుంచి త‌ప్పించార‌న్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని స్ప‌ష్టం చేశాయి. ''ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ అలియాతో సంప్ర‌దింపులు జ‌రుపుతూనే వుంది. షెడ్యూళ్లు ఇంకా ఖ‌రారు కాలేనందున‌.. అలియా సెట్‌కి వెళ్ల‌లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో షూటింగులెప్పుడో చెప్ప‌లేం. అలాంట‌ప్పుడు అలియా ఆర్‌.ఆర్‌.ఆర్ సెట్లో అడుగుపెట్ట‌లేద‌న‌డంలో అర్థం లేదు'' అని క్లారిటీ ఇచ్చింది.

ALSO READ: పెళ్ళి చూపులు హీరోయిన్ జోరు అలా ఉంది.