ENGLISH

చిరు రాకకు స‌ర్వం సిద్ధం

16 November 2020-12:30 PM

ఎట్ట‌కేల‌కు ఆచార్య షూటింగ్ మొద‌లైంది. గ‌త వార‌మే.. ఈసినిమా సెట్స్‌పైకి వెళ్లినా, చిరంజీవికి క‌రోనా సోకింద‌ని తెలిసి, ఆయ‌న షూటింగ్ కి దూరంగా ఉన్నారు. అయితే.. చిరుకి క‌రోనా పాజిటీవ్ అనే వార్త ఉత్తిదే అని తేలింది. త‌ప్పుడు రిపోర్టుల వ‌ల్లే... ఇలా వచ్చింద‌ని నిర్దార‌ణ అయ్యింది. అందుకే చిరు `ఆచార్య` సెట్లో అడుగు పెట్ట‌డానికి ఉవ్వీళ్లూరుతున్నారు. అందుకు ముహూర్తం కూడా సిద్ధ‌మైంది. ఈనెల 20న చిరు ఆచార్య సెట్లో అడుగుపెట్ట‌బోతున్నారు.

 

ఇప్ప‌టి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని కొర‌టాల శివ భావిస్తున్నారు. మార్చిలోగా చిరు పోర్ష‌న్ మొత్తం లాగించేయాల‌నుకుంటున్నార్ట‌. ఆ త‌ర‌వాత‌.. చిరు త‌న కొత్త సినిమా `వేదాళం` రీమేక్ తో బిజీ అవుతారు. రామ్ చ‌ర‌ణ్ సెట్లోకి ఎప్పుడు అడుగుపెడ‌తాడ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న కాజ‌ల్ కి ఇటీవ‌లే పెళ్ల‌యిన సంగ‌తి తెలిసిందే. త‌ను ఇప్పుడు హ‌నీమూన్ మూడ్ లో వుంది. తాను కూడా త్వ‌ర‌లోనే ఆచార్య సెట్లో అడుగుపెట్ట‌నుంది. 2021 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: ప‌వ‌న్ రీమేక్‌పై అవి రూమ‌ర్లే!