ENGLISH

బాల‌య్య‌తో అల్ల‌రోడు?

14 September 2020-11:01 AM

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. త‌న సినిమాలో ఎప్పుడూ భారీ సెట‌ప్ పెట్ట‌డం బోయ‌పాటికి అల‌వాటే. చిన్న చిన్న పాత్ర‌ల కోసం పెద్ద పెద్ద న‌టీనటుల్ని తీసుకొస్తుంటాడు. ఈ సినిమాలో శ్రీ‌కాంత్ న‌టిస్తున్నాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్‌పేరు కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది.

 

ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం అల్ల‌రి న‌రేష్ ని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. న‌రేష్ కూడా ఈ సినిమా చేయ‌డానికి ఓకే అనేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టులోకి న‌రేష్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మ‌హ‌ర్షిలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించాడు న‌రేష్‌. ఆ సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే... న‌టుడిగా న‌రేష్‌కి వ‌చ్చిన మైలేజీ త‌క్కువే.

 

ఆ త‌ర‌వాత‌... ఆ త‌ర‌హా పాత్ర‌లు చేయ‌కూడ‌ద‌ని న‌రేష్ నిర్ణ‌యించుకున్నాడు కూడా. కానీ బోయ‌పాటి సినిమా అవ్వ‌డం, బాల‌య్య‌తో కాంబినేష‌న్ కుద‌ర‌డంతో న‌రేష్ కాద‌న‌లేక‌పోయాడ‌ని తెలుస్తోంది. దానికి తోడు ఈ సినిమా కోసం న‌రేష్‌కి భారీ పారితోషికం కూడా ముట్ట‌జెప్ప‌నున్నార్ట‌. దాంతో న‌రేష్ ఓకే అనేశాడని టాక్‌.

ALSO READ: ర‌కుల్ కి రిలీఫ్‌.. డ్ర‌గ్స్‌కేసులో లేద‌ట‌!