ENGLISH

చిన్న‌ప్ప‌టి స‌మంత‌గా... అల్లు అర్జున్ కుమార్తె?

15 July 2021-12:37 PM

అల్లు అర్జున్ త‌న‌య అర్హ‌... గురించి తెలియంది ఎవ‌రికి..? ఆ చిట్టి సిసింద్రీ.. సోష‌ల్ మీడియా స్టార్‌. అర్హ‌కి సంబంధించిన వీడియోల‌ను బ‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తూనే ఉంటాడు. అందుకే... ఇప్పుడు త‌ను కూడా ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో ప‌డింది. అర్హ ప్ర‌ధాన పాత్ర‌లో దిల్ రాజు ఓ సినిమాని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు... గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `శాకుంత‌ల‌మ్`లోనూ అర్హ‌కి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది.

 

ప్ర‌స్తుతం `శాకుంత‌ల‌మ్` సెట్లో అర్హ అడుగుపెట్టింద‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. అర్హ‌.. దాదాపు 10 రోజులు ఈ షూటింగ్ లో పాలు పంచుకుంటుంద‌ని స‌మాచారం. అర్హ గురించి బ‌న్నీ అన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ని, అర్హ‌తో పాటు స్నేహారెడ్డి కూడా సెట్లో ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. శాకుంత‌ల‌మ్ లో స‌మంత క‌థానాయిక అన్న సంగ‌తి తెలిసిందే. బహుశా చిన్న‌ప్ప‌టి స‌మంత‌గా.. అర్హ న‌టిస్తుందేమో చూడాలి.

ALSO READ: 'మా' అధ్య‌క్షుడు మంచు వారి అబ్బాయేనా?