ENGLISH

అల్లు అర్జున్‌ పుత్రోత్సాహం

12 June 2017-12:46 PM

అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ 'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌' ఆడియో ఫంక్షన్‌లో సందడి చేశాడు. ఈ ఆడియో ఫంక్షన్‌కే మెయిన్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. దాంతో కెమెరా కళ్లన్నీ అల్లు అయాన్‌పైనే. స్టేజ్‌ పైకెక్కి అందరికీ నమస్కారం చేశాడు. అది చూసిన అల్లు అర్జున్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ అయ్యారు. అల్లు అయాన్‌ ఇంత వయసప్పట్నుంచే ఇంత సందడి చేస్తున్నాడు. అభిమానులకు అభివాదం చేస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటో చూసి ఆనందంతో ఊగిపోవడం అభిమానుల వంతయ్యింది. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'డీజె'. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ నిన్న హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కి అల్లు అర్జున్‌ తన భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్‌, కూతురు అర్హతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగానే అల్లు అయాన్‌ అందర్నీ ఆకర్షించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో రూపొందిన ఆడియో ఈ సినిమాకి ప్రధాన ఆకర్షనగా నిలవనుంది. సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న అల్లు అర్జున్‌ ఈ సినిమాతో ఓ బంపర్‌ హిట్‌ కొట్టడం పక్కా అంటూ అంచనాలు వేస్తున్నారు. దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ బ్రాహ్మణ యువకుడిగా కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: కొడుతున్నాం, కొట్టేస్తున్నాం: బన్నీ కాన్ఫిడెన్స్‌