ENGLISH

దుశ్యంతుడిగా బ‌న్నీ?

08 January 2021-11:12 AM

గుణ‌శేఖ‌ర్ `శాకుంత‌ల‌మ్‌`లో శ‌కుంత‌ల‌గా.. స‌మంత సెట్ట‌యిపోయింది. ఇప్పుడు దుశ్యంతుడి పాత్ర కోసం ఓ హీరో కావాలి. ఈ హీరో ఎవ‌ర‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. స‌మంత‌ని తీసుకున్నారు కాబ‌ట్టి.. ప‌క్కనా త‌ప్ప‌కుండా స్టార్ హీరోనే ఉండాలి. నిజానికి ఈ సినిమాని ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తీద్దామ‌నుకున్నాడు గుణ‌. కొత్త న‌టీన‌టుల‌తో లాగించేద్దాం అనుకున్నాడు. అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి స‌మంత వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో స్టార్ హీరో అవ‌స‌రం ఏర్ప‌డింది.

 

దుశ్యంతుడిగా అల్లు అర్జున్ ని ఎంచుకుంటే ఎలా ఉంటుందా? అని గుణ‌శేఖ‌ర్ ఆలోచిస్తున్నాడ‌ని స‌మాచారం. ఇది వ‌ర‌కు `రుద్ర‌మదేవి`లో గోన గన్నారెడ్డిగా బ‌న్నీ క‌నిపించాడు. ఆ పాత్ర‌... బ‌న్నీకి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో.. గుణ‌శేఖ‌ర్‌కి మ‌రోసారి కాల్షీట్లు కావాలన్నా ఇవ్వ‌డానికి బ‌న్నీ రెడీ అయిపోయాడు. అయితే దుశ్యంతుడిగా చేస్తాడా, లేదా? అనేదే డౌటు. పైగా `పుష్ష‌` బిజీలో బ‌న్నీ ఉన్నాడు. అందులోంచి కొన్ని కాల్షీట్లు గుణ శేఖ‌ర్ సినిమాకి కేటాయించ‌గ‌లిగితే.. గుణ పంట పండిన‌ట్టే. మ‌రి బ‌న్నీ ఏం చేస్తాడో చూడాలి.

ALSO READ: మహేష్ సినిమాలో రేణూ...క్లారిటీ వ‌చ్చేసింది