ENGLISH

బ‌న్నీ - హ‌రీష్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

03 February 2022-18:25 PM

మెగా కాంపౌడ్ కి బాగా కావ‌ల్సిన వాడు హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి భ‌క్తుడిగా పేరు తెచ్చుకున్న హ‌రీష్‌... వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల‌తో సినిమాలు చేశాడు. హిట్లూ ఇచ్చాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో చేసిన `డీజే` పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోకి కూడా వెళ్తోంది.

 

ఈలోగా... అల్లు అర్జున్ - హ‌రీష్ మ‌ళ్లీ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్‌. ఈరోజు బ‌న్నీని క‌లిశాడు హ‌రీష్‌. ఆ ఫొటోని ట్వీట్ కూడా చేశాడు. `త‌గ్గేదే లే.. ఎందుకు తగ్గాలి.. బ‌న్నీతో ఎప్పుడు క‌లిసినా స‌ర‌దాగా ఉంటుంది.. ల‌వ్ యూ బ‌న్నీ` అంటూ ట్వీటాడు. స‌డ‌న్‌గా ఇప్పుడు వీరిద్ద‌రూ ఎందుకు క‌లిశార‌న్న చ‌ర్చ టాలీవుడ్ లో న‌డుస్తోంది. బ‌హుశా బ‌న్నీతో హ‌రీష్ కి సినిమా చేయాల‌ని వుందా, బ‌న్నీనే హ‌రీష్ ని కావాల‌ని పిలిపించాడా? అనే స్థాయిలో చ‌ర్చ న‌డుస్తోంది. డీజే సినిమాని హిందీలో రీమేక్ చేయ‌బోతున్నాడు హ‌రీష్‌. ఆ సినిమాకి సంబంధించి కొన్ని కీల‌క‌మైన మార్పులు చేశాడ‌ట‌. వాటి గురించి బ‌న్నీతో కూడా చ‌ర్చించ‌డానికి హ‌రీష్ వెళ్లాడ‌ని మ‌రో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా... వీరి క‌ల‌యిక‌.. కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిన‌ట్టైంది.

ALSO READ: ట్రైలర్: విక్రమ్ 'మహాన్'