ENGLISH

‘మార్చ్’ని టార్గెట్ చేసిన బన్నీ

03 October 2017-11:35 AM

దువ్వాడ జగన్నాధంతో తాజాగా ఒక హిట్ ని తన ఎకౌంటు లో వేసుకున్న బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ చిత్రానికన్నా ముందు తను తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సిద్ధం అయిన విషయం విదితమే. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఆ చిత్రం 2018 మార్చ్ నుండి మొదలుకానుందట. ఇప్పుడు చేస్తున్న నా పేరు సూర్య చిత్రం వచ్చే వేసవికల్లా పూర్తిచేసి విడుదల చేసాక లింగుసామి చిత్రం మొదలుకానున్నట్టు తెలిసింది.

ఈ చిత్రం ద్వారానే తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే కేరళలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోగా పేరున్న బన్నీ ఇక రాబోయే రోజుల్లో తమిళ మార్కెట్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు.

 

ALSO READ: ‘జై’ స్కోర్ 125 నాట్ అవుట్!