ENGLISH

పోలీస్ స్టేషన్ లో బన్నీ... లోపల ఏం జరుగుతోంది?

24 December 2024-19:07 PM

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవటం, వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరి అయ్యి రిలీజ్ అవటం తెలిసిందే. బన్నీ రిలీజ్ తరవాత ఊహించని సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. కంప్లీట్ గా ఈ ఇష్యూ పొలిటికల్ గా మారింది. ఈ వివాదాల నేపథ్యంలో బన్నీ బెయిల్ రద్దుపై పోలీసులు కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నేడు అల్లు అర్జున్ చిక్కడ పల్లి పీఎస్ కి విచారణ నిమిత్తం హాజరయ్యారు. బన్నీ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్, లీగల్ టీం కూడా వెళ్లింది.

పోలీసు విచారణకు బన్నీ పూర్తిగా సహకరిస్తారని లాయర్ అశోక్ తెలిపారు. ఈ విచారణ కూడా లాయర్ సమక్షంలోనే ఉంటుందని తెలుస్తోంది. చిక్కడపల్లి ఏసీపీ, సీఐ రాజు బన్నీని ప్రశ్నించనున్నారు. బన్నీ చిక్కడపల్లి పోలీసు స్టేష్టన్ కి అటెండ్ అవుతుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి పీఎస్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేసారు. సీఎం రేవంత్ రెడ్డి, చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, తన పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రెస్ మీట్ లో చెప్పటం, అసలు తాను రాడ్ షో చేయలేదని కూడా చెప్పటంతో వివాదం మరింత ముదిరింది. దీనితో మళ్ళీ పోలీసులు బన్నీని విచారణకి పిలిచారు.

బెయిల్ పై ఉన్న బన్నీ అసలు ప్రెస్ మీట్ పెట్టడం తప్పని పోలీసుల వాదన. అందుకే మళ్ళీ వీరు బన్నీ బెయిల్ క్యాన్సిల్ చేయించటం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అని బన్నీ ఫాన్స్ ఆందోళ చెందుతున్నారు. మళ్ళీ బన్నీ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అని కంగారు పడుతున్నారు.