టాలీవుడ్ లో ఈ మధ్య అందరి కాన్సన్ ట్రేషన్ బన్నీపై ఉంటోంది. బన్నీ ఏం చేసినా, ఏం మాట్లాడినా క్షణాల్లో మీమర్స్, ట్రోలర్స్ ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. జనరల్ గా బన్నీ పై ఇంత వ్యతిరేకత ఉండేది కాదు. కానీ ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయటంతో మెగా ఫాన్స్ గుర్రు మన్నారు. ఇక అప్పటినుంచి బన్నీని టార్గెట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ వచ్చిన వారిని పేరు పేరునా ప్రస్తావిస్తూ విష్ చేసాడు కానీ జానీ మాస్టర్ పేరు ప్రస్తావించలేదు. ఒక తెలుగు వాడు నేషనల్ అవార్డు అందుకుంటే మనస్ఫూర్తిగా విష్ చేయలేకపోయాయడు బన్నీ. కారణం జానీ మాస్టర్ జనసేన గూటి పక్షి కావటమే.
అప్పుడు అంతా అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు. తాజాగా మళ్ళీ ఇంకో సారి బన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్స్ నోటికి పని చెప్పారు. సుకుమార్ భార్య తబిత ప్రమోట్ చేసిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ మరొకసారి మెగా ఫాన్స్ ని కెలికాడు. ''స్నేహితుడు లేదో ఇంకొకరు, లేదా మనకు కావాల్సిన వాళ్లు, ఇష్టమైన వాళ్ల కోసం మనం నిలబడాలి. నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా'' అని కామెంట్ చేసాడు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా నాగ బాబుని ఉద్దేశించి చేసినవి అని మెగా ఫాన్స్ వాదన.
'పుష్ప 2' క్లైమాక్స్ షూట్ లో ఉందని, అయినా తబిత గారు అడగటంతో వచ్చానని, నాకు ఇష్టమైతే, మనసుకు నచ్చితే ఏదైనా చేస్తానని చెప్పే ఉద్దేశ్యంతో ఇలా ఇండైరక్ట్ గా మెగా ఫ్యామిలీకి, ఫాన్స్ కి రిప్లై ఇచ్చారని సినీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే మెగా , అల్లు ఫాన్స్ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టే విధంగా బన్నీ మాట్లాడకుండా ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో పుష్ప 2 రిలీజ్ ఉంది. ఈ టైమ్ లో మెగా ఫాన్స్ ని కెలకటమెందుకు, ఆ ఎఫక్ట్ సినిమా పై పడే ఛాన్స్ ఉందని కొందరి అభిప్రాయం.