ENGLISH

బన్నీకి ఆ దర్శకుడు అంటే భయమా?

22 April 2024-22:14 PM

ఐకాన్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు.  'పుష్ప' మూవీతో నేషనల్ అవార్డ్ అందుకుని తెలుగు సినీచరిత్రలో సరికొత్త పేజి లిఖించాడు.  ప్రస్తుతం అన్నిటిలో నంబర్ వన్ గా కొనసాగుతూ అందరి ద్రుష్టిని తన వైపు తిప్పు కుంటున్నాడు. పుష్ప సినిమాతో నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.  పుష్ప 2  తో మరిన్ని రికార్డ్స్ సాధించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. నటుడిగా ఎన్నో విజయాలు సాధించిన బన్నీ ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడని మీకు తెలుసా .


బన్నీ అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేయటం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే అది అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా కావటంతో తండ్రి మాట ప్రకారం అసిస్టెంట్ డైరక్టర్ గా చేసాడంట. శ్రీకాంత్, వేణు, సునీల్ కీలక పాత్రల్లో నటించిన 'పెళ్లాం ఊరెళితే' సినిమాకి బన్నీ వర్క్ చేశాడు. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. తమిళ 'చార్లీ చాప్లిన్' కు రీమేక్ గా పెళ్ళాం ఊరెళితే వచ్చింది.  ఈ మూవీకి అల్లు అరవింద్  ఒక నిర్మాతగా వ్యవహరించారు. అరవింద్ చెప్పటంతో బన్నీ ఈ మూవీకి పని చేయక తప్పలేదట. 


పెళ్ళాం ఊరెళితే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. మొత్తానికి బన్నీ అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన మొదటి సినిమానే సూపర్ సక్సెస్ అయ్యింది.  కానీ ఆ టైమ్ లో దర్శకుడు  S .V కృష్ణా రెడ్డి అంటే అల్లు అర్జున్ కి తెగ భయం ఉండేదట. ఆ షూటింగ్ లో భయం భయంగా ఉండేవాడట బన్నీ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణా  రెడ్డి చెప్పటం గమనార్హం.