ENGLISH

బాబోయ్‌ అమెరికా: బెదిరిపోతున్న టాలీవుడ్‌

17 June 2018-12:54 PM

అమెరికా అంటే అదో అద్భుతం. ఎలాగైనా అమెరికా వెళ్లాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. 

సినీ పరిశ్రమ నుండి ఇంకాస్త ఈజీగా అమెరికా వెళ్లొచ్చు. ఓ సినిమాలో హీరో తాను ప్రేమించిన అమ్మాయి కోసం సినిమా యూనిట్‌ని పట్టుకుని అమెరికాకి వెళ్లిపోతాడు. రియల్‌ లైఫ్‌లో అది సాధ్యమేనా అనే విషయం పక్కన పెడితే, అమెరికా వెళ్లడం అనేది చాలా మందికి డ్రీమ్‌. సినీ పరిశ్రమలో ఉన్న వారికి ఇది ఇంకా ప్యాషన్‌. బోలెడన్ని తెలుగు అసోసియేషన్స్‌ ఉన్నాయక్కడ. అవి నిర్వహించే కార్యక్రమాలకు సినీ గ్లామర్‌ అవసరం ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది సినీ ప్రముఖుల్ని అమెరికాలోని తెలుగువారు అక్కడికి రప్పిస్తున్నారు.

 

దీన్ని ఆసరాగా తీసుకుని కిషన్‌లాంటి అక్రమార్కులు అక్కడ సినీ సెలబ్రిటీస్‌తో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రోగ్రాంస్‌ కోసం వెళ్లేవారు ఆ పని చూసుకుని వచ్చేస్తారు. వాటిని అడ్డం పెట్టుకుని వెళ్లే కొందరితోనే అసలు సమస్య. ఐదుగురు హీరోయిన్లు దొరికారన్న వార్తతో తెలుగు సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. 

ఈ మధ్య కాలంలో ప్రోగ్రామ్స్‌ పేరుతో అమెరికా ఎవరు వెళ్లి వచ్చారబ్బా..? అని ఆరా తీసేస్తున్నారు. అది అమెరికా వెళ్లి వచ్చినవారికి చాలా ఇబ్బందికరంగా మారింది. అసలే టాలీవుడ్‌ ఈ మధ్య చాలా వివాదాలతో సతమతమవుతోంది. మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టయ్యిందిప్పుడు.