ENGLISH

బిగ్ బి.. మొదలెట్టేశారు!

24 August 2020-14:36 PM

ఇటీవ‌ల క‌రోనా బారీన ప‌డి, ఆసుప‌త్రిలో చేరారు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌. ఆ త‌ర‌వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు సెట్లోనూ అడుగుపెట్టేశారు. `కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తీ` కొత్త సీజ‌న్ కి సంబంధించిన షూటింగ్ ఈ రోజే ప్రారంభ‌మైంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని ట్విట్ట‌ర్ లో పెట్టారు బిగ్ బీ. `బ్యాక్ టు వ‌ర్క్‌` అంటూ ఇన్ స్ట్రా లో పోస్ట్ చేశారు.

 

``ఇవి అద్భుత ఘ‌డియ‌లు. కేబీసీ మొద‌లై ఈ యేడాదితో 20 ఏళ్లు`` అంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు. అమితాబ్ జీవితాన్ని మార్చిన పోగ్రాం ఇది. ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయిన‌ప్పుడు కేబీసీ వ్యాఖ్యాత‌గా మారారు బిగ్ బీ. ఈ షో.. సామాన్య ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. ప్రాంతీయ భాష‌ల్లోనూ స్టార్లు.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, సామాన్య ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది కేబీసీ. ఇది 12వ సీజ‌న్‌.

ALSO READ: ప్ర‌భాస్ క‌థ‌లో.. రామ్ చ‌ర‌ణ్‌?