ENGLISH

అందాల అమైరా గ్లామర్‌ అదిరేలా.!

14 June 2018-16:22 PM

'మనసుకు నచ్చింది' సినిమాతో తెరంగేట్రం చేసి, ఇటీవల 'రాజుగాడు'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. ఆకట్టుకునే అందంతో విడుదలకు ముందు నుండీ ఈ క్యూటీ చాలా సందడి చేసింది. కానీ సక్సెస్‌ ఉంటేనే కదా అందానికి అసలు సిసలు విలువ. మంజుల దర్శకత్వంలో వచ్చిన 'మనసుకు నచ్చింది' సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. కానీ విడుదలయ్యాక సినిమాని పట్టించుకోలేదు. కూల్‌ రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి, స్టార్‌ హీరోల మధ్య తన వంతు పోటీగా రిలీజైన 'రాజుగాడు' కూడా ఆకట్టుకోలేదు. దాంతో ఈ బ్యూటీకి రెండు సార్లూ చేదు అనుభవమే ఎదురైంది. ఇకపోతే గ్లామర్‌ విషయం అంటారా? మంచి ఫిజిక్‌, ఏ కాస్ట్యూమ్‌ అయినా ఇట్టే సరిపోయే పర్సనాలిటీతో ఆ విషయంలో మాంచి టేస్ట్‌ ఉందీ హాట్‌ బ్యూటీకి. చూశారుగా, ఈ తాజా పిక్‌లో అమ్మడి గ్లామర్‌ అవతారం. అమ్మడు ధరించిన డ్రస్‌ చూస్తుంటే, ట్రెడిషనల్‌ వేర్‌లా అనిపిస్తోంది. కానీ చూపు తిప్పుకోని గ్లామర్‌తో పిచ్చెక్కించేస్తోంది.

ALSO READ: Qlik Here For The Gallery Of Amyra Dastur