ENGLISH

అన‌సూయ సినిమాని ఎంత‌కి కొన్నారు?

28 April 2021-15:19 PM

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ‌.. థియేట‌ర్ల‌కు తాళాలు ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో.. ఓటీటీ ద్వారాలు తెర‌చుకున్నాయి. ప‌లు చిన్న సినిమాల్ని కొన‌డానికి ఓటీటీ సంస్థ‌లు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో `థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌` ఓటీటీలో నేరుగా విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. అన‌సూయ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్ర‌మిది. మే 7న ఆహాలో నేరుగా విడుద‌ల కాబోతోంది.

 

అన‌సూయ సినిమా.. పైగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబ‌ట్టి.. రేటు బాగానే ప‌లికింద‌నుకున్నారు జ‌నాలు. కానీ తీరా చూస్తే.. ఈ సినిమా 1.5 కోట్ల‌కు కొన్నార్ట‌. సినిమా మేకింగ్ కే దాదాపుగా 2 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌య్యింద‌న్న‌ది టాక్‌. అంటే.. అర‌కోటి ఇక్క‌డే వ‌దులుకోవాల్సివ‌చ్చింది. అయితే శాటిలైట్ హ‌క్కులు మాత్రం నిర్మాత ద‌గ్గ‌రే ఉన్నాయి. కాబ‌ట్టి...కాస్త బెట‌ర్ డీల్ అనుకోవాలి. మే లో క‌నీసం ఆరేడు సినిమాలైనా ఓటీటీలోకి విడుద‌ల కానున్నాయ‌ని, వాటి బేర‌సారాలు జ‌రిగిపోయాయ‌ని, త్వ‌ర‌లోనే ఆయా సినిమాల విడుద‌ల తేదీలు ఖ‌రారు అవుతాయ‌ని తెలుస్తోంది. ఆ సినిమాలేంటో మ‌రి..

ALSO READ: Anasuya Latest Photoshoot