ENGLISH

ప్రముఖ యాంకర్ మృతి

09 October 2017-15:54 PM

ప్రముఖ యాంకర్, నటి మల్లిక (39) ఇక లేరు.

తెలియవస్తున్న వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం బెంగుళూరులో లో మల్లిక తుదిశ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నట్టు, గత 20రోజులగా ఆమె కోమాలోనే ఉన్నట్టు సమాచారం. అయితే ఆమె అనారోగ్యానికి గల అసలు కారణం తెలియాల్సిఉంది.

ఇక మల్లిక పలు చిత్రాల్లో నటించడమే కాకుండా ప్రముఖ టీవీ షోలకి యాంకర్ గా పనిచేసింది. ఆమె యాంకర్ గా కనబరిచిన ప్రతిభకి అవార్డులు సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు. మల్లిక అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నట్టు సమాచారం.

మల్లిక అకాలమృతికి www.iqlikmovies.com తరపున తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేస్తున్నాము.

 

ALSO READ: ప్రముఖ మాటల రచయత MVS హరినాథ్ రావు ఇక లేరు