30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? 30 రోజుల్లో హిందీ భాష నేర్చుకోవడం ఎలా? బుక్స్ గురించి తెలిసిందే. అలాగే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' నేర్పిస్తానంటున్నాడు యాంకర్ ప్రదీప్. మరి ఎక్కువ కాకపోతే ఏంటండీ. కొంప తీసి లవ్‌పై ప్రదీప్ ఏదైనా బుక్ రాసేశాడా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీకీ సంగతి తెలియాల్సిందే. అది ప్రదీప్ నటిస్తున్న సినిమా టైటిల్. అవునండీ మీరు విన్నది నిజమే. మన యాంకర్ ప్రదీప్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఏవండీ.. కమెడియన్లు హీరోలుగా ఎదుగుతున్న ఈ రోజుల్లో ప్రదీప్‌లాంటి యాంకర్స్‌ని హీరోలుగా మీరు ఎంకరేజ్ చేయరా? అఫ్‌కోర్స్ చేస్తారనుకోండి.
ఈ సినిమాతో అమృతా అయ్యర్ అనే ముద్దుగుమ్మ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఎస్.వి.బాబు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా నుండి 'నీలి నీలి ఆకాశం..'అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్‌ని సూపర్ స్టార్ మహేష్‌బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నాడు మన యాంకర్ ప్రదీప్. ఏమనుకున్నారు మనోడేం తక్కువోడా? అనూప్ రూబెన్స్ ఈ సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. 'సామజవరగమనా..' సింగర్ సిడ్ శ్రీరామ్ ఆలపించారు. గుబురు గెడ్డం, తలపాగాతో పల్లెటూరి కుర్రాడిగా ఈ సినిమాలో ప్రదీప్ కనువిందు చేయనున్నాడు. చూడాలి మరి, 30 రోజుల్లో మన ప్రదీప్ చెప్పే ప్రేమ పాఠాలు ఎలా ఉండబోతున్నాయో.
ALSO READ: 'హిట్' టీజర్ టాక్: ప్రామిసింగ్ పెర్ఫామెన్స్.