ENGLISH

ప్ర‌దీప్ అయిపోయాడు... ఇప్పుడు ర‌వి వ‌చ్చాడు

21 February 2021-11:27 AM

బుల్లి తెర‌పై విజృంభించిన వాళ్ల‌కు వెండి తెర‌పై అవ‌కాశాలు సుల‌భంగానే వ‌స్తాయి.కాక‌పోతే.., నిరూపించుకోవ‌డ‌మే కొంచెం క‌ష్టం. తెర మారుతుంది.. దాంతో పాటు అంచ‌నాలూ మారుతాయి. దాన్ని ప‌ట్టించుకోక‌పోతే.... ఫ‌లితాలు తారు మారు అవుతాయి. అందుకే చాలామంది బుల్లి తెర స్టార్లు వెండి తెర‌పై తేలిపోయారు. మొన్నామ‌ధ్య ప్ర‌దీప్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. `30 రోజుల్లో ప్రేమించ‌డంఎలా` సినిమాతో. నీలీ నీలీ ఆకాశం పాట ద‌య వ‌ల్ల‌... ఆ సినిమాకి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నిర్మాత కూడా గ‌ట్టెక్కేశాడ‌ని టాక్‌.

 

ఇప్పుడు అదే దోవ‌లో యాంక‌ర్ ర‌వి కూడా హీరో అయిపోయాడు. ర‌వి హీరోగా న‌టించిన చిత్రం 'తోట‌బావి'. అంజి దేవండ్ల ద‌ర్శ‌కుడు. గౌత‌మి హీరోయిన్. మార్చి 5న విడుద‌ల చేస్తున్నారు. ర‌వి ఇది వ‌ర‌కు ఓ చిన్న సినిమా చేశాడు. అది వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి, వెళ్లిపోయింది. ఆసినిమాకి ప‌బ్లిసిటీ కూడా స‌రిగా చేసుకోలేక‌పోయారు. ఈసారైనా ర‌వి ఆ త‌ప్పుని పున‌రావృతం కాకుండా చూసుకుంటాడేమో చూడాలి.

ALSO READ: క్రిష్‌కి మ‌రో ప‌ది రోజులు ఇచ్చిన ప‌వ‌న్‌