ENGLISH

బిగ్‌బాస్‌కి నో చెప్పిన ఆ హాట్‌ యాంకర్‌ ఎవరు?

15 June 2018-19:33 PM

బుల్లితెరపై ప్రసారమవుతోన్న మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ 2'లో కంటెస్టెంట్‌గా ఓ ప్రముఖ యాంకర్‌ని సంప్రదించిందట బిగ్‌బాస్‌ టీమ్‌. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఆమెని బిగ్‌బాస్‌లోకి ఆహ్వానం పలకాలని అనుకున్నారట. అందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేశారట. కానీ ఆ యాంకర్‌ సింపుల్‌గా నో చెప్పేసిందట. 

ఇంతకీ ఆ యాంకర్‌ ఎవరంటే, పేరు చెప్పలేం కానీ, ఈ మధ్య ఆ యాంకర్‌కి చాలా పాపులారిటీ వచ్చింది. గత కొంత కాలంగా హాటెస్ట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంటున్న ఈ హాట్‌ భామ ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయింది. అందుకే బిగ్‌బాస్‌ షోకి క్రేజ్‌ తెచ్చే ఉద్దేశ్యంతోనే భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసి, ఆమెని దించాలనుకున్నారట. అయితే అది కుదరకపోయేసరికి హీరోయిన్‌ ప్రగ్యాజైశ్వాల్‌ని కన్‌సల్ట్‌ చేసిందట బిగ్‌బాస్‌ యూనిట్‌. ప్రగ్యా 'బిగ్‌బాస్‌'లో ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పిందట. 

సో త్వరలోనే హాట్‌ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌ 'బిగ్‌బాస్‌' హౌస్‌లోకి హాట్‌ హాట్‌గా ఎంట్రీ ఇవ్వనుందనే చెప్పాలి. ఇంతవరకూ హౌస్‌లో ఉన్న హౌస్‌ మేట్స్‌లో చెప్పుకోదగ్గ పాపులర్‌ సెలబ్రిటీస్‌ లేరనే చెప్పాలి. ఇప్పుడు ప్రగ్యా ఎంట్రీతో 'బిగ్‌బాస్‌'కి కొత్త గ్లామర్‌తో పాటు, క్రేజ్‌ కూడా యాడ్‌ అవుతుంది. ముందే చెప్పాడుగా ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని, 'ఈ సారి కొంచెం మసాలా బాబాయ్‌..' అని. 

చూడాలిక ప్రగ్యా ఎంట్రీతో 'బిగ్‌బాస్‌'కి ఎక్స్‌ట్రాగా యాడ్‌ అయ్యే మసాలా ఎలా ఉండబోతోందో.!

ALSO READ: సమ్మోహనం మూవీ రివ్యూ & రేటింగ్