ENGLISH

ఆ సినిమాలో 8మంది హీరోయిన్లు?!

21 June 2021-11:00 AM

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించిన ఎఫ్ 2... ఎంత ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే ఎఫ్ 3 కూడా తీసేస్తున్నారు. ఇందులో త‌మ‌న్నా, మెహ‌రీన్ క‌థానాయిక‌లు. అయితే... ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ ఇద్ద‌రితో ఆగ‌లేదు. మ‌రికొంత‌మంది క‌థానాయిక‌ల్ని రంగంలోకి దింపుతున్నాడు.

 

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ఓ ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌నుంద‌ని టాక్‌. అంతే కాదు... అంజ‌లి సైతం ఓ పాట‌లో త‌ళుక్క‌న మెర‌వ‌బోతోంద‌ట‌. సోనాల్ చౌహాన్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. వీళ్లు మాత్ర‌మే కాదండోయ్‌... అనిల్ రావిపూడి గ‌త చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో న‌టించిన ర‌ష్మిక‌ని సైతం అతిథి పాత్ర‌లో తీసుకురాబోతున్నాడ‌ని తెలుస్తోంది. `ఎఫ్ 2`లో అన‌సూయ ఓ ప్రత్యేక గీతంలో క‌నిపించింది. తాను సైతం ఇందులో మ‌ళ్లీ మెరిసే అవ‌కాశం ఉంది. మాజీ హీరోయిన్ సంగీత‌కి ఓ హాస్య ప్ర‌ధాన మైన పాత్ర అప్ప‌గించాడ‌ట అనిల్ రావిపూడి.

 

అలా.. ఈ సినిమాలో హీరోయిన్ల‌తో నింపేశాడు. మ‌రి వీళ్లంద‌రిలో ఎవ‌రి పాత్ర‌లు ఖాయ‌మో, ఎవ‌రు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: గోపీచంద్ సినిమాకి మోక్షం